ఎలక్ట్రిక్ స్పోర్ట్స్లగ్జరీ బైకులు తయారు చేసే అల్ట్రా వయొలెట్ హైదరాబాద్‌లో ఎఫ్ 77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ను లాంచ్ చేసింది. ఇందులో 10.3 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ స్పీడ్ 155 కిలోమీటర్లు. దీనిపై ఎనిమిది లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. ధర రూ.మూడు లక్షలు.
ఈ సందర్భంగా సంస్థ యూవీ స్పేస్ స్టేషన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. 2024 దీపావళి నాటికి 10 నగరాల్లో 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.