క్రికెట్ లో ప్రతి జనరేషన్ లో కొంతమంది ప్లేయర్లు తమదైన మార్క్ వేస్తారు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడుతూ అలవోకగా పరుగులు రాబడతారు. ఈ తరంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్,జో రూట్ ఈ లిస్ట్ లో ఉన్నారు. దశాబ్ద కాలంగా ఈ నలుగురు క్రికెట్ లో పోటీపడి మరీ పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్ లో తగ్గేదే లేదన్నట్టు అదరగొట్టారు. అయితే, ప్రస్తుతం వీరు క్రికెట్ లో పరుగులు చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. ఫామ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా.. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడం లేదు.
కెప్టెన్సీ రాజీనామా:
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) పపువా న్యూ గినియాపై జరిగిన మ్యాచ్ తర్వాత కేన్ విలియంసన్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో క్రికెట్ లో ప్రస్తుతం ఈ నలుగురు క్రికెటర్లు ఏ ఫార్మాట్ లో కెప్టెన్సీ చేయకపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదివరకే కోహ్లీ, స్మిత్, రూట్ తమ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు బ్యాటర్ గాను, మరోవైపు కెప్టెన్ గా క్రికెట్ లో తమదైన హవా చూపిన ఈ నలుగురు.. ప్రస్తుతం పరుగులు చేయడంలో తడబడుతున్నారు. ఒకప్పటిలా కసిగా వీరు పరుగులు చేయలేకపోతున్నారు.
మూడు ఫార్మాట్లలో వీరు రెగ్యులర్ గా కొనసాగడం లేదు. స్మిత్ కు టీ20, వన్డే జట్టులో స్థానం లభించడం లేదు. రూట్ పరిస్థితి అలాగే ఉంది. టీ20ల్లో చోటు కోల్పోయిన రూట్.. వన్డేల్లో స్థానం అనుమానంగా మారింది. కోహ్లీ మూడు ఫార్మాట్లలో కొనసాగినా.. రెస్ట్ తీసుకుంటూ.. ప్రధాన మ్యాచ్ ల్లోనే కనబడుతున్నాడు. విలియంసన్ టెస్టుల్లో రాణిస్తున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో చేతులెత్తేస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యాబ్ 4 టెస్టులకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పటికైనా ఈ నలుగురు గాడిలో పడతారా లేకపోతే క్రికెట్ లో మరో ఫ్యాబ్ 4 పుట్టుకొస్తుందేమో చూడాలి.
None of the Fab 4 are captains anymore. The era has come to an end. 💔 pic.twitter.com/ZXBrnA6fQr
— CricketGully (@thecricketgully) June 19, 2024