
Fabtech Technologies Stock: త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండే చాలా మంది చిన్న పెన్నీ స్టాక్స్, స్మాల్ క్యాప్ కంపెనీ షేర్ల వెనుక పరిగెడుతుంటారు. అయితే ఇక్కడ కావాల్సింది కొంత సమయం వెచ్చించి రీసెర్చ్ చేసి తమ పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా ఉండే సరైన షేర్లను ఎంచుకోవటమే. చిన్న షేర్లలో ఎల్లప్పుడూ వాటి ఆర్థిక పనితీరు, భవిష్యత్తు వ్యాపార వ్యూహాలు, వ్యాపార అవకాశాలను కూడా గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేయటం ద్వారా మార్కెట్ల ప్రతికూల సమయంలో కూడా పెన్నీ స్టాక్స్ అద్భుతమైన పనితీరుతో డబ్బుల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్లకు అదిపోయే లాభాలను అందించిన ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ క్లీన్‌రూమ్స్ కంపెనీ షేర్ల గురించే. ఐపీవో సమయంలో ఒక్కో షేరును రూ.85 ఇష్యూ ధర వద్ద సొంతం చేసుకున్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం ధనవంతులుగా మారిపోయారు. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ధర రూ.339 వద్ద క్లోజ్ అయ్యింది.
Also Read :- భారత టెక్కీలపై సంచలన రిపోర్ట్.. ఛీ కంపెనీలు ఇలా చేస్తున్నాయా..?
జనవరి మెుదటి వారంలో ఐపీవోగా వచ్చిన ఈ కంపెనీ కేవలం మూడు నెలల కాలంలోనే లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.4 లక్షలుగా మార్చేసింది. పైగా మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో ఒడిదొడుకులను చూస్తున్నప్పటికీ ఈ పెన్నీ స్టాక్ మాత్రం లాభాల పంట పండించటంతో ఇన్వెస్టర్లలో పండుగ వాతావరణం నెలకొంది. లిస్టింగ్ రోజున స్టాక్ ఒక్కోటి 90 శాతం ప్రీమియం ధర రూ.161.50 వద్ద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే గడచిన నెల రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 20 శాతం రాబడిని అందించింది.
కంపెనీ వ్యాపారం..
2015లో స్థాపించబడిన ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ క్లీన్‌రూమ్స్ లిమిటెడ్ అనేది ఫార్మాస్యూటికల్, బయోటెక్, హెల్త్‌కేర్ రంగాలకు టర్న్‌కీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందించటంలో ప్రత్యేకత కలిగిన ప్రపంచవ్యాప్త సంస్థగా నిలిచింది. ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్యానెల్స్, డోర్స్ తయారు చేయటంలో ప్రత్యేకతను కలిగి ఉంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.