RR vs GT: పరాగ్, శాంసన్ మెరుపులు.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

RR vs GT: పరాగ్, శాంసన్ మెరుపులు.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తమ ఫామ్ ను కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా గుజరాత్ పై జరుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు విఫలమైనా.. సూపర్ ఫామ్ లో ఉన్న పరాగ్, కెప్టెన్ సంజు శాంసన్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. పరాగ్ 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
 
జైస్వాల్, పరాగ్ భారీ భాగస్వామ్యం 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో ఆచితూచి బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్ కు 32 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఆరో ఓవర్లో రషీద్ ఖాన్ గత మ్యాచ్ సెంచరీ హీరో జోస్ బట్లర్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 42 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్, పరాగ్ జట్టును ఆదుకున్నారు. మొదట్లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత బౌండరీల వర్షం కురిపించారు.
 
వీరి ధాటికి స్కోర్ బోర్డు పరుగులెత్తింది. మూడో వికెట్ కు ఏకంగా 130 పరుగుల భాగస్వాన్ని నెలకొల్పి జట్టును నిలబెట్టారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప పరాగ్ 3 ఫోర్లు, 5 సిక్సులతో 76 పరుగులు చేస్తే.. శాంసన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.