మడగాస్కర్​ వ్యక్తికి సక్సెస్​గా కిడ్నీ మార్పిడి

హైదరాబాద్​సిటీ, వెలుగు: మడగాస్కర్​కు చెందిన రోగికి సిటీలోని పేస్​ హాస్పిటల్ సంక్లిష్టమైన ఏబీవో బ్లెడ్ గ్రూప్ కిడ్నీ మార్పిడిని సక్సెస్​గా పూర్తి చేసింది. డయాలసిస్ ​చేయించుకుంటున్న సైమన్ ఎరిక్ అనే వ్యక్తి​ దీర్ఘకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడడమే కాకుండా గతంలో బ్రెయిన్​స్ట్రోక్​కు గురయ్యారు. ఫలితంగా రెండు కళ్లకు అంధత్వం ఏర్పడింది. స్థూలకాయంతో పాటు మధుమేహంతో వచ్చే సమస్యలతో కిడ్నీ మార్పిడి చాలా సవాలుగా మారింది. కిడ్నీదాత అయిన ఆయన భార్య (ఓ పాజిటివ్​)తో పోలిస్తే డిఫరెంట్ బ్లడ్ గ్రూప్​ను కలిగి ఉన్నాడు.

 ఈ క్రమంలో ల్యాప్రోస్కోపిక్​పద్ధతులను ఉపయోగించి డాక్టర్లు​ విశ్వంభర్​నాథ్, అభిక్​ దేవ్ నాథ్, రవిచంద్ర, కిషోర్​కుమార్ బృందం ఆపరేషన్​ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా డాక్టర్​ విశ్వంభర్​నాథ్​ శుక్రవారం మాట్లాడుతూ ఇది చాలా క్లిష్టమైన మార్పిడి ప్రక్రియ అని, డాక్టర్ల అనుభవం, నైపుణ్యం వల్లనే ఇది సక్సెస్ అయ్యిందన్నారు.