దేశంలోనే మొదటిసారి ఫేస్ రికగ్నైజేషన్ యాప్

దేశంలో మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో యాప్ ను ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. కొంపల్లి  ఆరు వార్డుల్లోని 10 పోలింగ్ స్టేషన్లలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉపయోగిస్తున్నారు.  స్థానిక 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31, 32 లో  ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఓటర్ల గుర్తింపు కొనసాగుతోంది.

ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో పలువురు మంత్రులు, నాయకులు తమ ఓటు హక్కును వినయోగించుకున్నారు. ప్రజలందరూ తప్పక ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ జిల్లాలో ఒటేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వనపర్తి జిల్లా 23వ వార్డులో మంత్రి నిరంజన్ రెడ్డి, 29వ వార్డులో కలెక్టర్ శ్వేతా మహంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొద్దున ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.

మరిన్ని వార్తలు..

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పు ఇచ్చే.. హెల్త్‌‌ లోన్​ కార్డ్‌‌ 

కేంద్రం 166 కోట్లిస్తే.. రాష్ట్రం చిల్లిగవ్వ ఇవ్వలె

రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

‘కరోనా’ వైరస్‌… ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది