న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల ( బాండ్లు, కమర్షియల్ పేపర్లు వంటివి) ఫేస్ వాల్యూని రూ.లక్ష నుంచి రూ. 10 వేలకు సెబీ తగ్గించింది. దీంతో కంపెనీలు కనీసం రూ. 10 వేల ఫేస్ వాల్యూతో బాండ్లను ఇష్యూ చేయొచ్చు. బాండ్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచేందుకు సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. బాండ్ల ధరలు తక్కువగా ఉంటే రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేస్తారని భావిస్తోంది.
ఫలితంగా కార్పొరేట్ మార్కెట్‌లో లిక్విడిటీ పెరుగుతుందని అంచనా వేస్తోంది. ‘డెట్ సెక్యూరిటీలు లేదా నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్షియల్ షేర్లను ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఫేస్ వాల్యూ రూ.10 వేలకు ఇష్యూ చేయొచ్చు’ అని సెబీ పేర్కొంది. కానీ, తక్కువ ఫేస్ వాల్యూకి బాండ్లను అమ్మాలనుకునే కంపెనీలు కనీసం ఒక మర్చంట్ బ్యాంకర్‌ను నియమించుకోవాలి. అలానే బాండ్లు వడ్డీ లేదా డివిడెండ్లను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు మార్కెట్‌లో ఫ్రాడ్స్‌ను అరికట్టేందుకు స్టాక్ బ్రోకర్లు ఓ ఇన్‌స్టిట్యూషనల్ మెకానిజంను ఏర్పాటు చేయాలని సెబీ ఆదేశించింది.