కాలిఫోర్నియా: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ ఫీచర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌బీ సేవల్లో ఒకటైన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటీ తెలిపారు. దీంతో ఇకపై ఎఫ్‌బీలో ఫొటోలు, వీడియోల్లో ఆటోమెటిక్‌గా అకౌంట్ మెంబర్ల ఫేస్‌లను గుర్తించే సదుపాయం ఉండదు.
#Facebook (@Meta) has announced that it is shutting down its Face Recognition system and will delete the facial data of more than one billion of its users. pic.twitter.com/Vz1k8VYAJl
— IANS Tweets (@ians_india) November 3, 2021
‘ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ సేవల్ని మేం నిలిపేస్తున్నాం. ఈ ఆప్షన్‌ను ఎంచుకున్న వారు ఇకపై ఫొటోలు, వీడియోల్లో ఆటోమెటిక్‌గా రికగ్నైజ్ అవ్వరు. ఇప్పటివరకు ఫొటోలు, వీడియోల్లో ఆటోమెటిక్‌గా రికగ్నైజ్ అయిన బిలియన్‌కు పైగా యూజర్ల టెంప్లేట్స్‌ను మేం డిలీట్ చేస్తాం’ అని జెరోమ్ పెసెంటీ ఓ ప్రకటనలో తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రజల్లో పలు సందేహాలు ఉన్నాయని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ టెక్నాలజీకి సంబంధించి పాటించాల్సిన రూల్స్‌పై రెగ్యులేటర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో దీని వాడకాన్ని తగ్గించడమే మంచిదని తాము భావిస్తున్నామని స్పష్టం చేసింది.