శాన్‌ఫ్రాన్‌సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది. ఇకపై ఈ సంస్థను ‘మెటా’గా పిలవనున్నారు. పేరు మార్పు విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించారు. భవిష్యత్‌లో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ (మెటావర్స్)కు ప్రాధాన్యత పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ సంస్థ అధీనంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్ పేరును మాత్రమే మార్చారు. వర్చువల్ విధాంనలో కలసుకొని.. ఉత్పత్పులను తయారు చేసే వేదికగా మెటావర్స్ ఉండబోతోందని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021
ప్రజల దృష్టి మళ్లించేందుకే పేరు మార్చారా?
గూగుల్ సంస్థలకు అల్ఫాబెట్ ఇంక్ అనే మాతృ సంస్థ ఉంది. ఈ మాతృ సంస్థ పరిధిలోనే గూగుల్‌కు సంబంధించిన అన్ని సంస్థలు పని చేస్తాయి. అందుకే ఫేస్‌బుక్ మాతృ సంస్థ పేరును మెటాగా మార్చాలని జుకర్‌బర్డ్ నిర్ణయించారు. దీని పరిధిలోనే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌గ్రామ్ ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. కాగా, ఫేస్‌బుక్ పేరు మార్పు సోషల్ మీడియా విభాగంలోనే కీలక పరిణామంగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు. ఫేస్‌బుక్ పేపర్ల పేరిట రీసెంట్‌గా బయటపడిన పత్రాలతో సంస్థ విమర్శల పాలైన నేపథ్యంలో.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కంపెనీ పేరు మార్చారని విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం.
The names of the apps that we build—Facebook, Instagram, Messenger and WhatsApp—will remain the same.
— Meta (@Meta) October 28, 2021
మెటా అంటే ఏంటి?
‘మెటా’ అనే పదం గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని అర్థం అంతకుమించి అని. మెటావర్స్ ఓ వర్చువల్ రియాలిటీ వెర్షన్‌లా కనిపించినా.. కొంతమంది అది ఇంటర్నెట్ వరల్డ్‌కు భవిష్యత్తుగా భావిస్తున్నారు. కంప్యూటర్ స్థానంలో మెటావర్స్‌లోని వ్యక్తులు హెడ్‌సెట్‌ను ఉపయోగించి అన్ని రకాల డిజిటల్ ఎన్విరాన్‌మెంట్‌లను కనెక్ట్ చేసే వర్చువల్ ప్రపంచంలోకి ప్రవేశించొచ్చు. గేమ్స్‌తోపాటు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వరకూ చాలా విధాలుగాల వర్చువల్ వరల్డ్‌ను వినియోగించుకోవచ్చు.