ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ యూజర్లు ఆదివారం ఇబ్బందిపడ్డారు. పలు దేశాల్లో ఫేస్ బుక్ పనిచేయలేదు. ఫేసు బుక్ అనుబంధ సంస్థలైన వాట్సప్, ఇన్ స్టగ్రామ్ కూడా వర్క్ కాలేదు. ఫేస్ బుక్ సర్వర్ డౌన్ కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఇబ్బంది కలిగిందని సంస్థ తెలిపింది. సర్వర్ కాన్ఫిగరేషన్ చేంజ్ కావడం వల్లే ఈ ఇబ్బంది కలిగిందని… సమస్య పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.
ఇండియాలో ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత… సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు సైలెంట్ అయ్యాయి. సడెన్ గా వాట్సప్ కనెక్ట్ కాలేదు. వైఫై ఆఫ్ చేశారు. ఆన్ చేశారు. మొబైల్ డేటా ఆఫ్ చేశారు. ఆన్ చేశారు. ఐనా… మెసేజ్ లు పోలేదు. వాట్సప్ లో సమాచారం రాలేదు. ఫొటోలు , వీడియోలు సెండ్ కాలేదు. డౌన్ లోడ్ కాలేదు. వాట్సప్ , ఫేస్ బుక్ వాడే నెటిజన్లు ఈ సాయంత్రం చాలా డిజప్పాయింట్ అయ్యారు. తాము ఎదుర్కొంటున్న ఇష్యూను చాలామంది ట్విట్టర్ లో, ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. #WhatsAppDown #FacebookDown #InstagramDown హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి. తమ బాధ వర్ణణాతీతం అంటూ చాలామంది కామెంట్లు, మీమ్స్ పోస్ట్ చేశారు.