క‌రోనా వైర‌స్ పై ఫేక్ కంటెంట్ : 7 కోట్ల పోస్ట్ లు డిలీట్

క‌రోనా వైర‌స్ పై ఫేక్ కంటెంట్ :  7 కోట్ల పోస్ట్ లు డిలీట్

క‌రోనా వైర‌స్ పై వైర‌ల్ అయిన 7 కోట్ల ఫేక్ న్యూస్ ను డిలీట్ చేసిన‌ట్లు ఫేస్ బుక్ ప్ర‌క‌టించింది. ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా సంస్థ రెండవ త్రైమాసికంలో ద్వేషపూరితంగా ఉన్న 22.5 మిలియన్ పోస్ట్‌లను తొలగించింది. ఇది మొదటి త్రైమాసికం కంటే 9.6 మిలియన్లకు పెరిగింది.దీంతో పాటు ఉగ్రవాద సంస్థలకు మ‌ద్ద‌తుగా ఉన్న 8.7 మిలియన్ పోస్టులను తొల‌గించ‌గా.. గ‌తంలో ఈ పోస్ట్ లు 6.3మిలియ‌న్లు ఉన్నాయి.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా త‌క్కువ మంది ఉద్యోగులు విధులు నిర్వ‌హిడం వ‌ల్ల ఆటోమెషిన్ టెక్నాల‌జీ పై ఆధార‌ప‌డ్డామ‌ని ఫేస్‌బుక్ తెలిపింది.
ఆటో మెషిన్ టెక్నాల‌జీ ఆధారంగా సోష‌ల్ మీడియాలో ఆత్మ‌హ‌త్య‌, నగ్నత్వం , లైంగిక దారుణాల‌కు సంబంధించిన కంటెంట్ పై చర్యలు తీసుకున్న‌ట్లు పేర్కొంది.
ఫేక్ కంటెంట్ ను నియంత్రించేందుకు, టెక్నాల‌జీతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేస్ బుక్ ప్ర‌క‌టించింది.