లైవ్‌ స్ట్రీమింగ్‌పై ఫేస్ బుక్ ఆంక్షలు

లైవ్‌ స్ట్రీమింగ్‌పై ఫేస్ బుక్ ఆంక్షలు

న్యూజిలాండ్ నరమేధం తర్వాత ఫేస్ బుక్ ఓ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన సంస్థ.. మరో దిద్దుబాటు చర్యకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఫేస్‌ బుక్‌ లైవ్‌ లను  మానిటర్‌ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ఫేస్‌ బుక్‌ లైవ్‌ లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట.

క్రైస్ట్‌ చర్చ్‌ ఊచకోత సంఘటన లైవ్‌ స్ట్రీమింగ్‌పై రేగిన దుమారం క్రమంలో ఫేస్ బుక్ బ్లాగ్ లో కొన్ని మార్పులు చేస్తుంది. తన ప్లాట్‌ ఫాంపై  ప్రత్యక్ష ప్రసారాలను కట్టడి చేయనుంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ సీవోవో  షెరిల్ శాండ్‌ బెర్గ్‌ తన బ్లాగ్‌ లో తెలిపారు.  ప్రామాణిక ఉల్లంఘనలులాంటి అంశాలపడి ఆధారఫడి ఫేస్‌ బుక్‌ లో ఎవరు లైవ్‌ కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌ బుక్‌ పరిశీలిస్తుందని తెలిపారు.