సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పనిచేయడం లేదు.. అవును నిజం.. ఫేస్ బుక్ యాక్సెస్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫేస్ బుక్ లాగిన్ కాగానే కనిపించాల్సిన హోం పేజీ బ్లాంక్ గా కనిపిస్తోంది. ఈ ఫ్లాట్ ఫారమ్ సర్వర్ లతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.దీనికి సంబంధించిన విషయాన్ని యూజర్ల్ X ఫ్లా్ట్ ఫారమ్లో పెట్టి విచారం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది ఫేస్ బుక్ లాగిన్ తర్వాత ఖాళీ స్ర్కీన్ కనిపిస్తుందని..వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను X లో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 14 సాయంత్రం 5.10 ప్రాంతంలో ఫేస్ బుక్ ఖాతాలను వినియోగించడంతో లాగిన్ సమస్యను షేర్ చేశారు. దీంతో ఈ విషయం బయటికొచ్చింద. వెబ్ సైట్ లు, ఆన్ లైన్ సేవలను ట్రాక్ చేసే ఫ్లాట్ ఫారమ్ డౌన్ డిటెక్టర్.. ఫేస్ బుక్ వెబ్ సైట్ గురించి సాయంంత్రం 5 గంటల తర్వాత సర్వర్ సమస్యలను తెలుపుతూ రిపోర్టులను చూపింది. అదే సమయంలో Xలో చాలా మంది వినియోగ దారులు ఫేస్ బుక్ వినియోగించడంతో తలెత్తిన సమస్యలను పోస్ట్ చేశారు.
ఫేస్ బుక్ లాగిన్ తర్వాత హోమ్ ఫేజీని కనిపించడం లేదు.. #facebookdown అనే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి చాలా మంది వినియోగదారులు తమ సమస్యలను X లో పోస్ట్ చేశారు. అయితే కొంతమంది ఫేస్ బుక్ యూజర్లకు మాత్రమే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్ బుక్ ఎటువంటి సమాచారం గానీ, ప్రకటన గానీ చేయలేదు.