డిసెంబర్ 12 నుంచి సెక్రటేరియెట్​లో ఫేషియ‌‌‌‌‌‌‌‌ల్ రిక‌‌‌‌‌‌‌‌గ్నైజేష‌‌‌‌‌‌‌‌న్ అటెండెన్స్

డిసెంబర్ 12 నుంచి సెక్రటేరియెట్​లో ఫేషియ‌‌‌‌‌‌‌‌ల్ రిక‌‌‌‌‌‌‌‌గ్నైజేష‌‌‌‌‌‌‌‌న్ అటెండెన్స్

హైదరాబాద్​, వెలుగు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌‌‌‌‌‌‌‌చివాల‌‌‌‌‌‌‌‌యంలో ఫేషియ‌‌‌‌‌‌‌‌ల్ రిక‌‌‌‌‌‌‌‌గ్నైజేష‌‌‌‌‌‌‌‌న్ అటెండెన్స్ విధానాన్ని గురువారం నుంచి అమ‌‌‌‌‌‌‌‌లు చేయ‌‌‌‌‌‌‌‌నున్నారు. ఈ మేర‌‌‌‌‌‌‌‌కు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స‌‌‌‌‌‌‌‌చివాల‌‌‌‌‌‌‌‌యంలో ప‌‌‌‌‌‌‌‌ని చేసే అన్ని శాఖ‌‌‌‌‌‌‌‌ల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ వ‌‌‌‌‌‌‌‌ర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌‌‌‌‌‌‌‌చివాల‌‌‌‌‌‌‌‌యం హెడ్ నుంచి వేత‌‌‌‌‌‌‌‌నాలు పొందే ప్రతి ఉద్యోగికి వ‌‌‌‌‌‌‌‌ర్తింపజేయనున్నట్టు తెలిపారు.

 ఉద్యోగులందరూ సెక్రటేరియల్ బిల్డింగ్ ఎంట్రీలో ఉన్న ఫేషియల్ రిక‌‌‌‌‌‌‌‌గ్నైజేష‌‌‌‌‌‌‌‌న్ మెషీన్ల వద్ద తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలి. ఉదయం ఆఫీసుకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లేటప్పుడు విధిగా హాజరు నమోదు చేయాలి. ఫేషియల్ రికగ్నైజేష‌‌‌‌‌‌‌‌న్ లో ఏదైనా సమస్య ఏర్పడితే సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉటుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది.