నేను రాను బిడ్డో..  గాంధీ దవాఖానకు!

నేను రాను బిడ్డో..  గాంధీ దవాఖానకు!
లోపలికెళ్లగానే ఇబ్బందులే ఎదురొస్తయ్​ కంపు కొడుతోన్న పరిసరాలు పనిచేయని మెడికల్ ఎక్వీప్ మెంట్ జనరల్ వార్డు మధ్యనే కరోనా వార్డు పట్టించుకోని అడ్మినిస్ట్రేషన్ అధికారులు పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ గాంధీ లో అన్నీ సమస్యలే..!  రోగుల హెల్త్​సంగతేమో గానీ హాస్పిటల్ చూస్తే భయం పట్టుకుంటుంది.!!  హాస్పిటల్ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ కంపు కొడుతున్నాయి. పరిశుభ్రత లేదు. అధికారుల పర్యవేక్షణ లేదు. మెడికల్​ఎక్వీప్​మెంట్స్​పని చేయవు. రోగులను పట్టించుకునే వారే లేరు. ఓపీ దగ్గర ఫుల్ రద్దీ. కరోనా సేఫ్టీ ప్రి కాషన్స్ ఉండవు. ఇష్టానుసారంగా వెహికల్స్ పార్కింగ్. అడ్మినిస్ట్రేషన్ అధికారులు పట్టించుకోరు. కరోనా సెకండ్ వేవ్​ టెన్షన్ ఉంది.  ఒకే గేట్ నుంచి కరోనా, నాన్ కరోనా పేషెంట్లను పంపిస్తున్నారు.  ఇలా గాంధీ హాస్పిటల్ ల్​కు వచ్చే వారికి అన్ని ఇబ్బందులే ఎదురొస్తాయి. ఒక్కసారి వచ్చి పోయిన పేషెంట్లు మళ్లీ రావాలంటేనే ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. మెడికల్​ ఎక్వీప్ ​మెంట్స్ పని చేస్తలేవు హాస్పిటల్ లో  మెడికల్​ ఎక్వీప్​మెంట్స్​ పనిచేయటకపోవడం తో  పేషెంట్లు ఎంతగా ఇబ్బంది పడినా ఎవరూ పట్టించుకోరు. పేరుకే ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ ఉంది. అది ఎప్పుడూ పనిచేయదు. ఒక్కసారి రిపేర్ చేయిస్తే మళ్లీ రెండు నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆరు నెలల పాటు మూలకే ఉంటుంది. ప్రస్తుతం ఎంఆర్ఐ పనిచేయకపోవడంతో పేషెంట్లను ఉస్మానియాకు రెఫర్ చేస్తున్నారు. దీంతో  రోజుల తరబడి రిపోర్టుల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. క్యాత్ ల్యాబ్ అయితే ఏళ్లుగా మూలకే పడి ఉంది. టు డీ ఎకో  మెషీన్లు నాలుగింట్లో రెండే పనిచేస్తున్నయ్. సిటీ స్కాన్ లు రెండుంటే ఒకటి కరోనా పేషెంట్ల కోసమే వాడుతున్నారు. అన్ని డిపార్ట్ మెంట్లలో దాదాపు సగానికి పైగా మెషీన్లు, ఇతర పరికరాలు పనిచేస్తలేవు. దీంతో  పేషెంట్లు రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం విభాగంలో సిబ్బంది కొరత ఉంది. దీంతో పోస్ట్ మార్టం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. కరోనా, కామన్​ పేషెంట్లకు ఒకటే ఎంట్రీ కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెట్టిస్తుంటే గాంధీ డాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం  లేదు. గత నెల నుంచి జనరల్ ఓపీ ప్రారంభమైంది. నాటి నుంచి కరోనా టెస్ట్ ల కోసం వచ్చే సస్పెక్టర్స్​, ఓపీ పేషెంట్లు ఓపీ మెయిన్ గేట్ నే వాడుతున్నారు. దీంతో చాలా మంది పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. కరోనా వార్డును గచ్చిబౌలి లోని టిమ్స్ కు తరలించాలని కోరుతున్నారు. జనరల్ వార్డు ను,  కరోనా వార్డును వేర్వేరుగా ఉంచే విధంగా ఎలాంటి చర్యలు చేపడతలేరు.  ఓపీ బిల్డింగ్ వద్ద పార్కింగ్ ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. ఓపీ మెయిన్ గేట్ వద్ద భారీ గా వెహికల్స్​ పార్క్ చేస్తుండడంతో పేషెంట్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. హాస్పిటల్ లో  నెలకొన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేషెంట్లు, వారి వెంట వచ్చే వారు కోరుతున్నారు. ఫైర్ సేఫ్టీలో నిర్లక్ష్యం గాంధీలో ఫైర్ సెఫ్టీని పూర్తిగా గాలికొదిలేయడంతో ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఆందోళన కలిగిస్తోంది. ఎనిమిది ఫ్లోర్ల హాస్పిటల్ బ్లాక్ ల్లో ఎక్కడా ఫైర్ ఎక్స్ టింగర్స్ లేవు. వాటర్ పైపుల బాక్స్ లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గాంధీ మెయిన్ బిల్డింగ్ లోని 3వ ఫ్లోర్ లోని ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. మెడికల్ పరికరాలు కాలిపోయాయి. ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులు డ్రమ్ముల నుంచి నీరు తెచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలు వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. నిత్యం వేల సంఖ్యలో ఓపీకి, వందల సంఖ్యలో అడ్మిట్ అయి ట్రీట్ మెంట్ తీసుకునే పేషెంట్లు ఉండే గాంధీలో ఫైర్ సెఫ్టీపై ఇప్పటికైనా రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ సరిగా లేదు క్లీన్ గా ఉండాల్సిన హాస్పిటల్ కంపు కొడుతుంది. హాస్పిటల్ లోపల, ఆవరణలో ఎక్కడ చూసినా మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో దుర్వాసన వస్తుంది. సెల్లార్ లో చెత్తా చెదారం పేరుకుపోయింది. రాత్రైతే దోమలు పరేషాన్ చేస్తున్నాయి. దీనికి తోడు మెయిన్ బిల్డింగ్ సెల్లార్ లోని డైట్ క్యాంటీన్ వద్ద స్లాబ్ సీలింగ్ నుంచి నీళ్లు లీకవుతుండగా పెచ్చులు ఎక్కడా మీద పడతాయోనని అంతా ఆందోళన చెందుతున్నారు. For More News.. అమెరికా కొత్త ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లకు లైన్‌క్లియర్ సోయా సీడ్స్​ ఇవ్వలేం.. చేతులెత్తేసిన సీడ్ కార్పొరేషన్ అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వలేం.. తొలి తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్