కామారెడ్డి , వెలుగు: రాజీవ్స్వగృహలోని అసంపూర్తి ఇండ్లు, ఖాళీ ప్లాట్ల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరినా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ. 12.43 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా గవర్నమెంట్ కేవలం రూ. 75 లక్షలు శాంక్షన్ చేసింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధరణి టౌన్షిపు పేర రాజీవ్‌స్వగృహ ఇండ్ల నిర్మాణం చేపట్టగా మధ్యలో నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ ఇండ్లు, ప్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. కామారెడ్డి ధరణి టౌన్షిప్ ఇండ్లు, ప్లాట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.50.71 కోట్ల ఆదాయం సమకూరింది. మధ్య తరగతివారు, ఉద్యోగుల కోసం గత ప్రభుత్వ హాయంలో రాజీవ్ స్వగృహ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. హౌజింగ్ కార్పొరేషన్‌ద్వారా గవర్నమెంట్స్థలాలను డెవలప్‌చేసి.. ఇండ్లు కట్టి అమ్మాలని భావించారు. ఇందులో భాగంగా కామారెడ్డి దగ్గర అడ్లూర్ శివారులో హైవే పక్కన 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. బేసిక్, సివిక్, క్లాసిక్, ఇంట్రీన్ సిక్కేటగిరిల్లో 100, 150, 200, 266 గజాల ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 543 ఇండ్లు కట్టాలని ప్లాన్ చేసి పనులు ప్రారంభించారు. ఇందులో 313 ఇండ్ల నిర్మాణం చేపట్టగా కొంతకాలానికి వివిధ దశల్లో పనులు అగిపోయాయి. మరో 230 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. గత ఏడాది ఈ ఇండ్లు, ప్లాట్లను వేలం ద్వారా అమ్మకాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.
ఇప్పటికే 4 విడతల్లో వేలం
కామారెడ్డి ధరణి టౌన్ షిపులో ఇప్పటి వరకు 4 సార్లు వేలం నిర్వహించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యాపారులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, ఎంప్లాయిస్‌తో మీటింగ్‌లు నిర్వహించారు. ఇండ్లు, ప్లాట్లు కొంటే టౌన్షిపులో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో 150కి పైగా ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు 4 సార్లు వేలం నిర్వహించగా, 351ఇండ్లు, ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇంకా 192 అమ్మాల్సి ఉంది.
రూ.12.43 కోట్లతో ప్రపోజల్స్
ధరణి టౌన్ షిపులో రోడ్లు, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్‌ల నిర్మాణం, వాటర్పైపులైన్లు, కరెంటు పోల్స్ కోసం తదితర పనులు చేపట్టవలసిఉంది. ఈ సౌకర్యాల కోసం రూ.12.43 కోట్లతో జిల్లా ఆఫీసర్లు ప్రపోజల్స్ తయారీ చేసి గవర్నమెంట్‌కు పంపారు. అయితే సర్కారు కేవలం రూ.75 లక్షలు శాంక్షన్చేసింది. ఈ ఫండ్స్‌తో కరెంట్ లైన్, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వేలం ప్రక్రియకు ముందు ఏరియా క్లీనింగ్ , మట్టి రోడ్డు వేయటానికి కలెక్టర్, మున్సిపల్ ఫండ్స్ నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇండ్లు, ఖాళీ స్థలాలు కొన్నవారు ఇక్కడ ఉండాలంటే మౌలిక వసతులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఫండ్స్రిలీజ్ చేయకపోవడంతో ప్లాట్లు కొన్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.