ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి

ప్రజలు తమ పనులు, సమస్యల పరిష్కారం కోసం  ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే అక్కడ వారు కూర్చునేందుకు తగిన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఒక్కోసారి సంబంధిత అధికారులు సమయానికి ఉండకపోవచ్చు.  కొన్ని సందర్భాల్లో సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది.  అలాంటి సమయాల్లో వచ్చినవారు అక్కడే వేచి చూడాల్సి వచ్చినప్పుడు ఆ కార్యాలయంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

అందువల్ల బయటే ఎండలో నిలబడాల్సి వస్తోంది.  ఈ రకమైన సమస్యలు ప్రభుత్వ కార్యాలయాల్లో దర్శనమిస్తున్నాయి.   కావున అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించాలి. తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు  మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. 
- కె,  శ్రావణ్, జనగామ జిల్లా