గిన్నిస్ బుక్‌లో ధోని బ్యాట్‌.. నిజంగా వేలం వేశారా.. లేదా..?

గిన్నిస్ బుక్‌లో ధోని బ్యాట్‌.. నిజంగా వేలం వేశారా.. లేదా..?

2011 ప్రపంచ కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011, ఏప్రిల్ 2న వాంఖడే వేదికగా మిత్ర దేశం శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడింది. 

ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విన్నింగ్స్ షాట్‌ని సిక్స్‌గా మలిచి.. భారతీయులకు మరుపురాని విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ధోని వాడిన బ్యాట్‌ను వేలం వేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

'ఈస్ట్ మీట్స్ వెస్ట్' అనే ఛారిటీ సంస్థ వేలం నిర్వహించగా.. ఆర్‌కే గ్లోబల్ షేర్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 100,000 పౌండ్లకు (భారత కరెన్సీలో రూ. 83 లక్షలు) ఈ బ్యాట్‌ను సొంతం చేసుకుందని ఓ నివేదిక వెల్లడించింది. దీంతో అత్యంత ఖరీదైన క్రికెట్ బ్యాట్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని తెలిపింది. అయితే ఈ వార్తలను ధోని సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అవన్నీ రూమర్స్ అని చెప్తున్నారు.

బ్యాట్ ఖరీదు రూ. 1 లక్ష

సాధారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో క్రికెటర్లు ఉపయోగించే క్రికెట్ బ్యాట్‌లు రూ. 15,000 నుండి రూ. 40,000 రేంజ్‌ వరకు ఉంటాయి. స్పెషల్‌గా చేపించుకుంటే మాత్రం మరికొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిందే. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోని ఉపయోగించిన బ్యాట్ అలాంటి ప్రత్యేకమైనదిగా చెప్తుంటారు. దీన్ని ప్రత్యేకమైన ఇంగ్లీష్ విల్లోతో తయారు చేశారని.. ధర దాదాపు రూ. 1 లక్ష అని సమాచారం.