ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారుతోంది. మంచికి వాడాల్సిన కృత్రిమ మేధ సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో ప్రముఖుల నకిలీ ఫొటోలు, వీడియోలు సృష్టించి వారి పరువు బజారు కీడుస్తున్నారు. మొన్నటికి మొన్న భారత క్రికెటర్ మహమ్మద్ షమీకి, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు పెళ్లి చేశారు.
ఇప్పుడు చూస్తే, అమిత్ షా తనయుడు చైర్మన్ జై షాకు.. సన్ TV నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌కు అంటగట్టారు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో బీచ్‌లో రోమాన్స్ చేస్తున్నట్లు ఏఐ సాయంతో ఫొటోలు సృష్టించారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తే ఏఐ సాయంతో క్రియేట్ చేసినవని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ మరొకరి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు.
రశ్మికతో మొదలు
ఏఐ టెక్నాలజీ బారిన పడిన మొట్టమొదటి సెలెబ్రిటీ.. రష్మిక మందన్న. డీప్ ఫేక్ సాయంతో జరా పటేల్ అనే యువతి లిఫ్టులో దిగిన వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక మందన్న తలను అతికించారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో వదిలారు. అప్పట్లో ఆ వీడియో పెద్ద దుమారాన్ని రేపింది. అన్ని వర్గాల నుంచి మందానకు మద్దతు లభించింది. ఇలాంటి వాటిని సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ALSO READ | Nathan Lyon: అశ్విన్ రికార్డు బ్రేక్.. అత్యధిక వికెట్ల వీరుడిగా నాథన్ లియాన్
అప్పట్లో కేంద్రం సైతం ఏఐ డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు హడావడిగా ప్రకటనలు చేసింది. కానీ, ఆ తరువాత అంతా శూన్యం. ఇప్పటికైనా కేంద్రం మేల్కొంటుందో.. లేదో చూడాలి.
Nowadays Mohammed Shami and Sania Mirza are seen together, are they going to get married?#MohammedShami#saniyamirza pic.twitter.com/OfUoBwGUl9
— Urooja (@Urooja12) December 26, 2024