బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించిందంటూ నెట్టింట కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో గౌరీ ఖాన్ పక్కన భర్త షారుఖ్, కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. గౌరీ ఖాన్ ఇస్లాం మతాన్ని ఆచరించాక ఈ ముగ్గురూ కలిసి మక్కాలో కొత్త సంవత్సరాన్ని స్వాగతించారని వదంతులు వ్యాపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో గౌరీ ఖాన్ నలుపు కుర్తీ, బూడిద రంగు హిజాబ్ ధరించి ఉండగా.. కింగ్ ఖాన్ తెల్లటి కుర్తాలో కనిపిస్తున్నాడు. ఆర్యన్ వారి వెనుక నిలబడి చూడవచ్చు. ఈ ఫోటోల వెనుకున్న వాస్తవం ఏమిటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఏఐ సాంకేతికతను ఉపయోగించి కొందరు ఆకతాయిలు చిత్రీకరించిన ఫొటోలవి. భార్య గౌరీ ఖాన్ ఇస్లాం మతాన్ని స్వీకరించదనేది పూర్తిగా అవాస్తవం.
పంజాబీ హిందూ కుటుంబం..
షారుఖ్ ఖాన్ ముస్లిం అయితే, గౌరీ ఖాన్ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు.. రమేష్ చంద్ర చిబ్బర్, సవితా చిబ్బర్. 1991లో వీరి పెళ్లి జరిగింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు..ఆర్యన్, సుహానా ఖాన్, అబ్రామ్ ఖాన్.
2005లో కాఫీ విత్ కరణ్‌లో పెళ్లి తర్వాత తన మతపరమైన విషయం గురించి గౌరీ ఖాన్ ఎదుట ప్రస్తావించగా.. తాను షారుఖ్ మతాన్ని గౌరవిస్తాను, కానీ తన మతం మారి ముస్లిం అవుతానని ఏనాడూ చెప్పలేదని ఆమె పేర్కొంది. అటువంటి వాటిపై తనకు నమ్మకం లేదని తెలిపింది. షారుఖ్ తన మతాన్ని ఎప్పటికీ అగౌరవపరచడు.. తాను అతని మతాన్ని అగౌరవపరచని వెల్లడించింది.