సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది. అదేంటో తెలుసా.. 2024 ఏప్రిల్ 19వ తేదీన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుందని.. మే 22వ తేదీన కౌంటింగ్ ఉంటుందని.. మే 30వ తేదీన కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందంటూ తేదీలతో సహా.. కేంద్ర ఎన్నికల సంఘం రాజ ముద్రతో.. స్క్రీన్ షాట్ సర్క్యులర్ అవుతుంది. ఇది నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎన్నికల సంఘం ప్రకటించకుండానే.. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన తేదీలు ఇవీ అంటూ వార్తలు రావటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.
A fake message is being shared on Whats app regarding schedule for #LokSabhaElections2024#FactCheck: The message is #Fake. No dates have been announced so far by #ECI.
— Election Commission of India (@ECISVEEP) February 24, 2024
Election Schedule is announced by the Commission through a press conference. #VerifyBeforeYouAmplify pic.twitter.com/KYFcBmaozE
ఇంతకు అసలు విషయం ఎంటంటే ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలక్షన్ షెడ్యూ్ల్ ప్రకటిస్తే ఈసీ సమావేశం ఏర్పాటు చేస్తుంది. నోటిఫికేషన్, ఓటింగ్, కౌంటింగ్ తేదీలను మీడియాకు వెల్లడిస్తుంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి ఉంటే ఈసీ తన వెబ్‌సైట్‌లో కూడా పెడుతుంది. కాబట్టి ఇది ఫేక్ న్యూ్స్ అని తేలిపోయింది. ఈసీ కూడా ఇది ఫేక్ అంటూ ఎక్స్ లో పోస్ట్ కూడా చేసింది. మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 97 కోట్ల మంది ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది, 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఓటర్లు పెరిగారు.
ALSO READ : ప్రపంచ వైరస్ లకు హైదరాబాద్ వ్యాక్సిన్ విరుగుడు : సీఎం రేవంత్ రెడ్డి