ఎంతకు తెగించార్రా..! షమీ - సానియా మీర్జాకు పెళ్లి చేసేశారు

ఎంతకు తెగించార్రా..! షమీ - సానియా మీర్జాకు పెళ్లి చేసేశారు

భారత పేసర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్కటైనట్లు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతటితో ఈ కథనాలు ఆగలేదు. ఈ జంట దుబాయ్‌లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేశారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అప్పుడలా.. ఇప్పుడిలా

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం సానియా మీర్జా గురించి ఎప్పటికప్పుడు అనేక వార్తలు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం సానియా.. పాకిస్థాన్‌కు చెందిన ఓ నటుడిని రహస్యంగా వివాహమాడినట్లు పుకార్లు వచ్చాయి. ఆ తరువాత అవన్నీ రూమర్లని తేలిపోయింది. ఇవీ అటువంటివే. సానియా మీర్జా, మహ్మద్ షమీలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనేది పచ్చి అబద్ధం. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలన్నీ ఫేక్. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో కొందరు కావాలనే పనికట్టుకొని వారిద్దరు పక్కపక్కనే ఉండే ఫొటోలు రూపొందించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

సానియా వ్యక్తిగత జీవితం

టెన్నిస్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సానియా మీర్జా.. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించి.. పెళ్లాడింది. అప్పట్లో వీరి పెళ్లి కూడా పెద్ద సెన్సేషన్. సానియాకు 120 కోట్ల(2010లో) జనాభా ఉన్న భారత దేశంలో వరుడు దొరకలేదా అనే మాటలు చాలా మందే అన్నారు. అవేమీ పట్టించుకోని ఈ జంట 2010లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ షోయ‌బ్‌కు అది రెండో వివాహం. మొదటి భార్య అయేషా సిద్ధిఖితో తెగదెంపులు చేసుకున్న అనంతరం సానియాను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళకు ఈ జంటకు ఓ కొడుకు పుట్టాడు. ఆ తరువాత షోయబ్ మళ్లీ గాడి తప్పాడు. అందమైన ఓ పాకిస్థాన్ నటి సనా జావేద్‌తో సీక్రెట్ఎఫైర్ నడిపాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో సానియా అతనికి విడాకులు ఇచ్చి గుడ్ బై చెప్పేసింది. ఇదీ తన మంచికే అనుకున్న పాక్ క్రికెటర్.. అంగరంగ వైభవంగా సనా జావేద్‌ను తన ఇల్లాలిని చేసుకున్నాడు.

మరోవైపు, మహమ్మద్ షమీ జీవితం అంతే. తన సతీమణి హసీన్ జహాన్‌కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో, ఈ ఇద్దరికీ ముడి పెట్టేశారు కొందరు ఆకతాయిలు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల వారికొచ్చే లాభమేమైనా ఉందా ఆంటే అదీ లేదు. ఇతరులను మానసికంగా వేధిస్తూ నవ్వుకోవటమే వీరి పని.