పాము.. ఆ మాట వినగానే, చూడగానే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి సరిసృపాల జాతికి చెందిన పాముల్లో.. బంగారు రంగు పాము ఒకటి. కథల్లో, సినిమా సన్నివేశాల్లో అలాంటి పామును చూసుండొచ్చు కానీ, నిజంగా ఎప్పుడూ చూసుండరు. ఇప్పుడు చూసే సంధర్భం వచ్చింది.
ఎక్స్‌లో ఓ వీడియో తెగ తిరిగేస్తోంది.. ఆ వీడియోలో ఓ పాము బంగారం రంగులో స్పష్టంగా కనిపిస్తోంది. జరజరా జారుకుంటూ వెళుతున్న ఆ పాము బంగారం రంగులో ఉండటంతో కొందరు ఆ దృశ్యాలు చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశారు. అయితే, ఈ దృశ్యాలు ఎక్కడ చిత్రీకరించనేది తెలియరాలేదు.
Golden snake 🐍 pic.twitter.com/kYnJ52gCEa
— Shanthosh (@shanthosh) April 4, 2024
నిజంగా గోల్డెన్ స్నేక్స్ ఉన్నాయా..!
వీడియోలో చూసినప్పటికీ.. బంగారు రంగు పాములు ఉంటాయనే దానిపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాల్లోనూ వాస్తవం లేకపోలేదు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో..! ఏది అబద్ధమో తెలియడం లేదు. దీంతో భూమిపై బంగారం రంగులో పాములు లేవని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో రూపొందించిన వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.