డీప్ ఫేక్,నకిలీ కంటెంట్కు చెక్ పెట్టేందుకు.. వాట్సాప్లో ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్

డీప్ ఫేక్,నకిలీ కంటెంట్కు చెక్ పెట్టేందుకు.. వాట్సాప్లో ఫ్యాక్ట్ చెకింగ్ హెల్ప్ లైన్

డీప్ ఫేక్ లు, నకిలీ కంటెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న పెద్ద సవాల్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ సవాల్ తో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి.. పరిష్కార మార్గాలకోసం వెతుకుతూనే ఉన్నాయి. AI రూపొందించిన తప్పుడు సమాచారం, పెరుగుతున్న  ముప్పును పరిష్కరించేందుకు ఫ్యాక్ట్ చెక్ సంస్థల సొసైటీ Misinformation Combat Alliance(MCA), వాట్సాప్ లో ప్రత్యేక రియాల్టీ చెక్ హెల్ప్ లైన్ ను ప్రారంభించేందుకు మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ హెల్ప్ లైన్ 2024మార్చి లో ప్రారంభించబడుతుంది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి సృష్టించిన నకిలీ మీడియా వ్యాప్తిని ఎదుర్కోవడమే దీని లక్ష్యం. WhatsApp హెల్ప్ లైన్ లో వచ్చిన అన్ని ఇన్ బౌండ్ మేజేజ్ లను చెక్ చేసేందుకు MCA  సెంట్రల్ డీప్ ఫేక్ అనాలిసిస్ యూనిట్ (DAU) ని ఏర్పాటు చేస్తుంది. 

ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ సేవల కింద కస్టమర్లు వాట్సాప్ లోని చాట్ బాట్ ద్వారా నేరుగా వారి ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు.వినియోగదారులు ఈ WhatsApp చాట్ బాట్ ను ఇంగ్లీషు తోపాటు మూడు  ప్రాంతీయ భాషల్లో ఉపయోగించుకోవచ్చు. 

Also Read : ట్రిబుల్ జీతం ఇస్తాం..మీరు రాజీనామా చేయొద్దు