Daniel Balaji: సంపాదన మొత్తం ఛారిటీలకే.. డేనియల్ బాలాజీ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Daniel Balaji: సంపాదన మొత్తం ఛారిటీలకే.. డేనియల్ బాలాజీ గురించి ఎవరికీ తెలియని నిజాలు

నటుడు డేనియల్ బాలాజీ(Daniel Balaji) గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్తతో తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. అయితే.. డేనియల్ బాలాజీని చూసినా, సినిమాలో ఆయన చేసిన పాత్రలు చూసినా చాలా వైలెంట్ గా  కనిపిస్తారు. కానీ, ఆయనొక గొప్ప మనసున్న వ్యక్తి. సేవా గుణమున్న మనిషి. ఈ నటుడి గురించి చాలా మందికి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అవి మీకోసం. 

డేనియల్ బాలాజీ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి
డేనియల్ బాలాజీ పేరు చూసి చాలా మంది ఆయన్ని క్రిష్టియన్ అనుకుంటారు. కానీ, ఆయనొక హిందూ  కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన నాన్న గారిది ఆంద్రప్రదేశ్ చిత్తూరు, తల్లిది చెన్నై కావడం వల్ల అక్కడే సెటిల్ అయ్యారు. బాలాజీకి చిన్నప్పటినుండి దైవ భక్తి ఎక్కువ. అందుకే ఆయన ప్రస్తుతం ఉంటున్న ప్లేస్ లో వాల్ల  కులదైవం ఆండాళ్ళమ్మ ఆలయాన్ని నిర్మించారు. అందుకోసం తన సంపాదన నుండి కోట్లు ఖర్చు చేశారు బాలాజీ.
 
పెళ్లి కూడా చేసుకోలేదు. 
డేనియల్ బాలాజీకి పెళ్లి కూడా జరగలేదు. ఆయనకీ చిన్నప్పటినుండి కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయిందట. ఆయనకు మొత్తం పదకొండు మంది తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పటినుండి తన ఫ్యామిలీలో ఉన్న పిల్లలను ఆడించడం, స్కూల్ కి తీసుకెళ్లడం, వంటివి చేశాడట. అందుకే మళ్ళీ అలాంటి జీవితంలోకి వెళ్లాలని అనిపించక పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడట. అదే విషయాన్ని వల్ల అమ్మకి కూడా చెప్పాడట. ఒకవేళ చేసుకుంటే కూడా నేనే చేసుకుంటానని, మీకు ఆ టెన్షన్ వద్దని చెప్పాడట.

డైరెక్టర్ అవుదామని వచ్చి నటుడిగా
డేనియల్ బాలాజీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాకు కో డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆలా చేస్తున్న సమయంలోనే ఆయన నటుడిగా అవకాశాలు వచ్చాయి. మెదటి అవకాశంగా నటి రాధిక చేసిన చిత్తి అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. ఇక అక్కడినుండి నటుడిగా మారాడు బాలాజీ.

సేవాగుణం ఎక్కువ
డేనియల్ బాలాజి చాలా గొప్ప మనసున్న వ్యక్తి. ఆయన సంపాదనలో ఎక్కువ శాతం సేవ కార్యక్రమాలకే ఉపయోగించేవారు. ఎన్నో ఛారిటీలకి డొనేషన్స్ కూడా ఇచ్చేవారు. ఆయన బ్రతకడానికి కావాల్సినంత దాచుకొని మిగతాది విరాళాలు ఇచ్చేసేవాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆయనది సేవా గుణమే కాదు.. గొప్ప మనసు కూడా. అందుకే.. ఆయన మరణానంతరం తన కళ్ళు మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని ఆయన కళ్ళని కూడా దానం చేశారు.