
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 76 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 76 ఉద్యోగాల్లో ప్రొఫెసర్లు 21, అసోసియేట్ ప్రొఫెసర్లు 33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విభాగాలు: సైన్సెస్, హ్యుమానిటీస్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ స్టడీస్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. వయసు 65 సంవత్సరాలు మించకూడదు. అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
అప్లికేషన్స్: అభ్యర్థులు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.uohyd.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.