మహారాష్ట్రలో కరెంట్ కోతలు సరిపోవన్నట్టు మరాఠ్వాడా ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఔరంగాబాద్ లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడింది. గత రెండు దశాబ్దాలుగా నగరంలో ఎన్నడూ లేని విధంగా నీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిది రోజులకు ఒక్కసారి నీటి సరఫరా కావడంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔరంగా బాద్ లో నీటి ఎద్దడిపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళలు ఖాళీ బిందెలను చూపిస్తూ ఆందోళన నిర్వహించారు. కాషాయ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వెంటనే నీటి ఎద్దడిని తీర్చి..ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.
Maharashtra | Former CM and BJP Leader, Devendra Fadnavis leads protest march over water crisis along with party workers in Aurangabad pic.twitter.com/JFp6AEIQCT
— ANI (@ANI) May 23, 2022
మరిన్ని వార్తల కోసం
ఏ స్థాయికి వెళ్లినా మాతృభూమిని మరువొద్దు
నా టార్గెట్ ఒలింపిక్స్