డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా ఫడ్నవీస్ షాకింగ్ డెసిషన్

 డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా ఫడ్నవీస్ షాకింగ్ డెసిషన్

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అవుర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీకి ఈ ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రల్లో కషాయ పార్టీకి ఎదురు గాలి వీచింది. రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నప్పటికి పార్టీ హవా చూపించలేకపోయింది. దీంతో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 

రాష్ట్రంలో పార్టీకి తక్కువ సీట్లు రావడానికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. పూర్తి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇక నుంచి పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు.

" పార్టీ పనితీరుకు పూర్తి బాధ్యత వహిస్తూ, మళ్లీ ప్రజల్లోకి రావడానికి కొత్త వ్యూహాన్ని రచిస్తామని హామీ ఇస్తూ.. ఈ పరాజయంతో, మా సీట్లు తగ్గాయి, దీనికి పూర్తి బాధ్యత నాదే. ఈ బాధ్యతను స్వీకరించి, ఏ లోటు ఉన్నా దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను.. నా ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను.. అని ఫడనివాస్ తెలిపారు.