ఓటమి బాధలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కు మరో షాక్ షాక్ తగిలింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్ రేట్ ప్రకారం.. బెంగళూరు జట్టు ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. దీంతో అతనికి జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇదే మొదటి స్లో ఓవర్ రేట్ కావడంతో రూ.12 లక్షల జరిమానా విధించబడింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఎలాంటి జరిమానా విధించబడలేదు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు గిల్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్ స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ కొరడా ఝళిపించింది. గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు తొలిసారి ఈ సీజన్ లో స్లో ఓవరేట్ విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఏకంగా రెండు సార్లు ఈ జరిమానా విధించబడింది. వరుసగా రెండో సారి స్లో ఓవరేట్ కారణంగా కెప్టెన్ తో పాటు ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. మరోసారి స్లో ఓవరేట్ కొనసాగిస్తే.. ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడిన కోల్‌కతా 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ (14 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) దుమ్మురేపితే, శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) నిలకడగా ఆడాడు. ఛేజింగ్ లో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 221 రన్స్‌కు ఆలౌటైంది. విల్ జాక్స్ (55), రజత్ పటీదార్ (52), కర్ణ్ శర్మ (20) పోరాడినా ఫలితం లేకపోయింది.
Faf Du Plessis & Sam Curran pic.twitter.com/CppW4Pr99s
— RVCJ Media (@RVCJ_FB) April 22, 2024