చెన్నై జట్టులోకి RCB కెప్టెన్ డుప్లెసిస్.. ఆసక్తికరంగా మారుతోన్న మినీ ఐపీఎల్!

చెన్నై జట్టులోకి RCB కెప్టెన్ డుప్లెసిస్.. ఆసక్తికరంగా మారుతోన్న మినీ ఐపీఎల్!

అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ)లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ 'టెక్సాస్ సూపర్ కింగ్స్' జట్టుకు ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది.

జూలై 13న నుంచి ప్రారంభం కానున్న మినీ ఐపీఎల్ 17 రోజుల పాటు అభిమానులను అలరించింది. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజిల్స్ సూపర్ నైట్‌రైడర్స్, సియాటెల్ క్యాపిటల్స్‌, ఏంఐ న్యూయార్క్ నాలుగు జట్లుగా కాగా.. మిగిలిన రెండు జట్లను భారత సంతతి వ్యక్తులే సొంతం చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీ(వాషింగ్టన్ ఫ్రీడం)ను సంజయ్ గోవిల్ కొనుగోలు చేయగా,  శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టును ఆనంద్ రామరాజన్ అనే భారత సంతతి వ్యాపారి కొనుగోలు చేశాడు.

టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు

పాప్ డుప్లెసిస్(కెప్టెన్), డేవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్, డేవిడ్ మిల్లర్, అంబటి రాయుడు, డానియల్ సామ్స్, డ్వేన్ బ్రావో, జెరాల్డ్ కోజీ, రస్టీ థెరాన్, కాల్విన్ సావేజ్, లాహిరు మిలాంత, మిలింద్ కుమార్, సామీ అస్లాం, కామెరాన్ స్టీవెన్సన్, చెట్టి, జియా షాజాద్, సాయితేజ ముకమల్ల.