
ఐపీఎల్ లో ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది. రాహుల్, మిచెల్ స్టార్క్ లాంటి ఆటగాళ్లు జట్టులో చేరడంతో జట్టులో స్టార్ ఆటగాళ్ల సంఖ్య పెరిగింది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లో కూడా ఫేవరేట్ జట్లలో ఒకటి. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్ గా జట్టును నడిపించనున్నాడు. 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ను సోమవారం (మార్చి 24) లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతుంది. తొలి మ్యాచ్ కు ముందు ఒక విషయంలో ఢిల్లీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ముగ్గురు స్టార్ ఓపెనర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్‌తో పాటు అనుభవజ్ఞులు డుప్లెసిస్, కేఎల్ రాహుల్ స్క్వాడ్ లో ఉన్నారు. ముగ్గురు కూడా తుది జట్టులో ఉండడానికి అర్హులు. గత సీజన్ లో మెక్‌గుర్క్ తన మెరుపు ఇన్నింగ్స్ లతో ఢిల్లీకి ఆశాకిరణంలా మారాడు. రాహుల్, డుప్లెసిస్ వేరే ఫ్రాంచైజీలు తరపున ఓపెనర్లుగా అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. దీంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. మెక్‌గుర్క్, డుప్లెసిస్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఓపెనర్లుగానే బ్యాటింగ్ చేశారు.
ALSO READ | Shashank Singh: నెం.1 ఆల్ రౌండర్‌కు నో ఛాన్స్: పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చెప్పిన శశాంక్ సింగ్
మరోవైపు రాహుల్ మాత్రం మూడు, నాలుగో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రికార్డ్ ఉంది. ఢిల్లీ జట్టు రాహుల్ ను తమ వైస్ కెప్టెన్ గా ప్రకటించిన తర్వాత అతను తుది జట్టులో ఉండడం ఖాయమైంది. అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్ లో మెక్‌గుర్క్, డుప్లెసిస్ ఓపెనర్లుగా దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ భారత జట్టు కోసం ఏ స్థానంలో ఆడించినా ఆడాడు. ఐపీఎల్ లో కూడా ఈ స్టార్ బ్యాటర్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆశ్చర్యం లేదు. పైగా రాహుల్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. దీంతో జట్టు కోసం మరోసారి తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతాడేమో చూడాలి.