కరేబియన్ లీగ్ ట్రోఫీని సెయింట్ లూసియా కింగ్స్ గెలుచుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం (అక్టోబర్ 7) ఉదయం జరిగిన కరేబియన్ లీగ్ ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌ను ఓడించి సెయింట్ లూసియా కింగ్స్ విజేతగా నిలిచింది. 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఆరు వికెట్లతో టైటిల్ కైవసం చేసుకుంది.
11 ఏళ్ళ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో తొలిసారి సెయింట్ లూసియా కింగ్స్ టైటిల్ గెలుచుకోవడం విశేషం.
విన్నింగ్ కెప్టెన్ డుప్లెసిస్ ను ట్రోఫీ అందుకోవడానికి పిలిచినప్పుడు ట్రోఫీ అందుకొని టీమిండియా కెప్టెన్ రోహిత్ స్టయిల్లో ట్రోఫీని సహచరులకు ఇచ్చాడు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ.. అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియోనల్ మెస్సీ శైలిలో ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా గెలవడంతో మెస్సీ ట్రోఫీ తీసుకొని చిన్నగా అడుగులే వేస్తూ ఈ సెలెబ్రేషన్ ను స్టార్ట్ చేశాడు.
ALSO READ | IND vs BAN 2024: జయసూర్యకు బంపర్ ఆఫర్.. శ్రీలంక కోచ్‌గా నియామకం
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యానా అమెజాన్ వారియర్స్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. నూర్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఛేజ్(39), ఆరోన్ జోన్స్ (48) భారీ హిట్టింగ్ తో సెయింట్ లూసియా కింగ్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. రోస్టన్ చేజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ మొత్తం నిలకడగా రాణించి 22 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
Captain Faf Du Plessis doing Indian Captain Rohit Sharma's Iconic walk celebrations style with CPL Trophy.🔥
— Tanuj Singh (@ImTanujSingh) October 7, 2024
- ROHIT SHARMA 🤝 FAF DU PLESSIS...!!!!pic.twitter.com/xEaZuCrqQO