మలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న జాతీయ ఉత్తమ నటుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్ గా ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు.పుష్ప సినిమాతో నేషనల్ వైడ్గా మరింత ఫేమస్ అయ్యాడు.విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలతో..ఒక సిగ్నేచర్ మూమెంట్ని క్రియేట్ చేశాడు.
రోమాంచం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం(Aavesham) మూవీ నేడు (ఏప్రిల్ 11న) థియేటర్లలలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకల్ గ్యాంగ్‍స్టర్ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో..ఆయనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు.
అయితే, ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది.మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ మే 17న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే సెకండ్ వీక్‌లోనే ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది.
సుకుమార్ - బన్ని కాంబినేషన్ లోని వచ్చిన పుష్పలో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఫహద్..నెక్స్ట్ రాబోయే సీక్వెల్ పుష్ప 2లో కూడా కనిపించనున్నాడు. ఇవే కాదు..ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ ఏకంగా డజను సినిమాల్లో నటిస్తున్నాడు.