Mystery Thriller OTT: ఓటీటీలోకి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ..అస్సలు మిస్సవ్వకండి

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి..ఇప్పుడు చెప్పేబోయే సినిమా కిక్ ఇస్తోంది. సాధారణంగా ఓటీటీలో రిలీజయ్యే మలయాళ సినిమాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తున్నాయి. ఫాహాద్ ఫాజిల్ (FahadhFaasil) హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఇరుల్(Irul).

ఈ థ్రిల్ల‌ర్ మూవీలో మంజుమ్మ‌ల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ విల‌న్‌గా న‌టించాడు. న‌సీఫ్‌యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వంలో ఈ మూవీ కొవిడ్ కార‌ణంగా మ‌ల‌యాళంలో 2021లో డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనే రిలీజైంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడానికి ఆహా 'ఇరుల్'ను స్ట్రీమింగ్ చేయబోతుంది.రేపు సెప్టెంబర్ 6 శుక్రవారం నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఇరుల్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

అయితే, తెలుగు ప్రేక్షకుల కోసం ఇదే నెల‌లో ఇరుల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స‌మాచారం. ఫ‌హాద్ ఫాజిల్‌కు జోడీగా ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ న‌టించింది. 

కథ విషయానికి వస్తే.. 

అలెక్స్ (సౌబీన్ షాహిర్‌) ఓ రైట‌ర్‌. త‌న ప్రియురాలు అర్చ‌న‌తో (ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్‌) క‌లిసి కారులో ట్రిప్‌కు బ‌య‌లుదేరుతాడు. ఓ అట‌వీ ప్రాంతంలో వారి కారు ఆగిపోతుంది. షెల్ట‌ర్ కోసం ద‌గ్గ‌ర‌లోని ఓ ఇంట్లోకి వెళ‌తారు. ఆ ఇంటి ఓన‌ర్ ఉన్ని (ఫ‌హాద్ ఫాజిల్‌) వారికి ఆశ్ర‌యం ఇస్తాడు.

నిజంగా అక్కడ ఉన్న ఉన్ని ఆ ఇంటి ఓన‌రేనా? లేదా సీరియల్ కిల్లర్ హా? అలంటి ఆపదలో ఉన్నఅలెక్స్‌, అర్చ‌న ఎలా గడిపారు? ఆ ఇంటి నుంచి ప్రేమజంట‌ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారా? వారు ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ బారిన ఎలా పడ్డారు? అక్కడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏ విధమైన ప్రయత్నాలు చేశారనేది ఈ మూవీ క‌థ‌.