క్రేజీ కాంబో రిపీట్.. మరోసారి రజినీతో సందడి చేయబోతున్న ఫహాద్

క్రేజీ కాంబో రిపీట్.. మరోసారి రజినీతో సందడి చేయబోతున్న ఫహాద్

మలయాళ నటుడే అయినా సౌత్‌‌‌‌లో సూపర్బ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు ఫహాద్ ఫాజిల్. ‘పార్టీ లేదా పుష్పా’ అనే డైలాగ్‌‌‌‌తో తెలుగులో తన ఇమేజ్‌‌‌‌ను  మరింత పెంచుకున్నాడు. అలాగే పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి తనదైన యాక్టింగ్‌‌‌‌తో మెస్మరైజ్ చేసిన ఫహాద్.. ఓ క్రేజీ  కాంబోను రిపీట్  చేయబోతున్నాడట. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయాన్’లో కీలక పాత్ర పోషించిన ఫహాద్.. మరోసారి రజినీతో స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ‘జైలర్ 2’లో ఓ ఇంపార్టెంట్ రోల్‌‌‌‌ కోసం ఫహాద్‌‌‌‌ను సంప్రదించగా, తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ కోలీవుడ్‌‌‌‌లో వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ  కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  ‘వేట్టయాన్‌‌‌‌’లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలవగా, ‘జైలర్ 2’ చిత్రంపైనా అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ‘జైలర్‌‌‌‌‌‌‌‌’లో అతిథి పాత్రలు పోషించిన మోహన్ లాల్, శివ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌లు ఇందులోనూ కొనసాగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.  సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.