తొర్రూరు, వెలుగు : వంద రోజుల పాలనలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యమైందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి లేగా రాంమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడారు. సాధ్యంకాని హామీలిచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు.
హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. వరంగల్ పార్లమెంటు సీటును రెండు లక్షల మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న తొర్రూరులో బీజేపీలో వివిధ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ సుంకరనేని కోటేశ్వర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కన్నయ్య, జిల్లా నాయకులు రంగు రాములు , సాయిని ఝాన్సీ, తొర్రూరు అర్బన్ అధ్యక్షుడు పల్లె కుమార్ తదితరులు పాల్గొన్నారు.