- అవకాశాలు కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధ్యం
- లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు
బషీర్ బాగ్, వెలుగు: దేశంలో యువ శక్తికి కొదవ లేదని, పాలకులు యువతను వినియోగించుకోవడంలో ఫెయిల్అవుతున్నారని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. యువతకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, అప్పుడే సమాజంలో ప్రతిభ వికసిస్తుందని అన్నారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నమో తెలంగాణ పేరిట శనివారం కోఠి మెడికల్ కాలేజీలో నేషనల్ యూత్ డే నిర్వహించారు.
రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమాయనంద మహరాజ్, జయప్రకాశ్‌నారాయణ పాల్గొన్నారు. జయప్రకాశ్‌నారాయణ మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యానికి బడ్జెట్లో ఒక్క శాతమే ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయని.. ఇతర దేశాలలో అది 8 శాతంగా ఉందన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత దేశ భవిషత్తులో భాగస్వామ్యం కావాలని స్వామి బోధమాయనంద మహరాజ్ పిలుపునిచ్చారు.
యువ వైద్యులకు నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్, షార్ట్ ఫిలిం, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు పురస్కారాన్ని అందజేశారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏజీ శంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.సురేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.