రైస్​మిల్లులో కల్తీ నూనె తయారీ.. ఇద్దరు అరెస్ట్

రైస్​మిల్లులో కల్తీ నూనె తయారీ.. ఇద్దరు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారంలోని శ్రీ వెంకటేశ్వర రైస్​ మిల్లుపై పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పల్లి నూనెను తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మహేశ్వరం ఎస్ఓటీ, కందుకూరు పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన బైరి పొన్నారెడ్డి, అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ మండలం మాన్యగూడకు చెందిన ముచ్చర్ల దామోదర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 27.5 క్వింటాళ్ల నాసిరకం వేరుశనగ, 8.5 క్వింటాళ్ల పశువుల దాణా సంచులు-, 75 లీటర్ల కల్తీ నూనె, ఖాళీ డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు.