క్షుద్ర పూజలు చేస్తమని  రూ. 7 లక్షలతో పరార్​ 

ఘట్​కేసర్, వెలుగు: క్షుద్రపూజలు చేస్తమని  రూ. లక్షల్లో తీసుకుని పాత నేరస్తులు అరెస్టయ్యారు. ఘట్ కేసర్ పీఎస్ పరిధిలోని ఎదులాబాద్​లో ఉండే రాజు వద్దకు గత నెల11న మాతం చందు, ఎర్నాల సంజీవ్ వెళ్లి  ఇంట్లో దయ్యాలు ఉన్నాయని,  క్షుద్రపూజలు చేయకపోతే చనిపోతావని భయపెట్టడమే కాకుండా ఇంటి కింద కోట్ల విలువైన గుప్తనిధులు ఉన్నాయని వాటిని బయటికి తీస్తామని నమ్మించి రూ. 7 లక్షల తీసుకుని పారిపోయారు. బాధితుడు పోలీసులకు కంప్లయింట్​ చేయగా కేసు ఫైల్ ​చేసి దర్యాప్తు చేపట్టారు. రామన్నపేట పీఎస్ పరిధిలో రేప్ కేసులో నిందితులైన కరీంనగర్ జిల్లాకు చెందిన  చందు, సంజీవ్ గా గుర్తించి భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల వద్ద  15 వేల నగదు , 2 సెల్ ఫోన్లు , ఆల్టో కారు , పూజా సామగ్రిని స్వాధీనం చేసుకుని ఆదివారం రిమాండ్ కు తరలించారు.