దేవరకొండ, వెలుగు: అన్ని రకాల రోగాలకు వైద్యం చేస్తానని ప్రజలను నమ్మించి లక్షలు దోచుకుంటున్న నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంకు చెందిన విశ్వచైతన్య సాఫ్ట్వేర్ఇంజనీర్గా చేసేవాడు. విలాస జీవితానికి అలవాటుపడి సంవత్సరం క్రితం నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం వద్ద పది ఎకరాలు కొని మాన్సి మహా సంస్ధాన్ పేరుతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆశ్రమంలో వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్నాడని, పలువురు మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు నల్గొండ టాస్క్ఫోర్స్పోలీసులు శనివారం రాత్రి ఆశ్రమంపై దాడి చేసి నకిలీ బాబాను అదుపులోకి తీసుకున్నారు.