ఊపిరి పీల్చుకున్న తిరుపతి : బాంబులు లేవని తేల్చేసిన పోలీసులు

ఊపిరి పీల్చుకున్న తిరుపతి : బాంబులు లేవని తేల్చేసిన పోలీసులు

తిరుపతిలోని ప్రైవేట్ హోటళ్లలో బాంబులు పెట్టినట్లు వచ్చిన ఈమెయిల్స్ ఆధారంగా ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు రిలాక్స్ అయ్యారు. 24 గంటలు సుదీర్ఘంగా సాగిన తనిఖీలు, సోదాల్లో ఎలాంటి బాంబులు లేవని స్పష్టం చేశారు పోలీసులు. బాంబు స్క్వాడ్స్, డాగ్ స్వ్కాడ్స్ అన్ని హోటళ్లను.. అణువణువూ తనిఖీ చేసి.. ఎలాంటి బాంబులు లేవని.. ఈ మెయిల్స్ సమాచారం అంతా ఫేక్ అని.. అలాంటి వారిపై రెండు కేసులు పెట్టినట్లు వివరించారు పోలీసులు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఓ హాటల్ కు శనివారం ( అక్టోబర్ 26)న బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇదే తరహాలో శుక్రవారం కూడా ఫేక్ బాంబు బెదిరింపులు రావడం విశేషం. అలిపిరిలో పలు హాటళ్లలో బాంబులు పెట్టినట్లు కొన్ని మెయిల్స్ వచ్చాయి. రాజ్ పార్క్ హోటల్, వైస్రాయ్ హోటల్లో బాంబ్స్ పెట్టినట్లు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్స్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చకున్నారు. ఫేక్ బాంబు కాల్స్ పై అక్టోబర్ 25న రెండు కేసులు నమోదు చేసినట్లు తిరుపతి  పోలీసులు తెలిపారు. ఈరోజు కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.