
- మధ్యప్రదేశ్‌లోని దామో సిటీలో ఘటన
ముంబై: మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలో దారుణం జరిగింది. ఓ క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫేక్ కార్డియాలజిస్ట్ నిర్వాకం వల్ల ఒకే నెలలో ఏడుగురు పేషెంట్లు చనిపోయారు. ఎన్ జాన్ కెమ్ అనే కార్డియాలజిస్ట్, దామో సిటీలో ప్రైవేటు మిషనరీ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. గడిచిన నెల రోజుల్లో అతడి వద్ద హార్ట్ సర్జరీలు చేయించుకున్నవారిలో ఏడుగురు రోగులు మరణించారు.
దీనిపై బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయగా..అసలు అతడు డాక్టరే కాదని తేలింది. ఎన్ జాన్ కెమ్ అనే ఓ ఫేమస్ బ్రిటిష్ డాక్టర్ పేరు వాడుకొని అతడు కార్డియాలజిస్టుగా చెలామణి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని నిర్ధారించారు.