- దేశంలోని వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ మెమోలు
- వాటితోనే ఫారెన్ వెళ్లిన 62 మంది
- 15 మంది సభ్యుల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
- 212 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం
హనుమకొండ, వెలుగు: విదేశాలకు స్టడీ వీసా మీద వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. చేసిన కోర్సులో బెస్ట్ పర్ ఫార్మెన్స్ఎంత ముఖ్యమో.. గుర్తింపు పొందిన యూనివర్సిటీల సర్టిఫికెట్ కూడా అంతే ముఖ్యం. అయితే విదేశాలకు వెళ్లాలనే ఆశ ఉండి.. గ్రాడ్యుయేషన్‌లో మార్క్స్సరిగా లేని స్టూడెంట్లను టార్గెట్ చేసుకుని కొంతమంది నయా దందాకు తెరలేపారు. దేశంలో గుర్తింపు కలిగిన వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి.. వాటితో స్టూడెంట్స్‌ను విదేశాలకు పంపించే బిజినెస్ స్టార్ట్ చేశారు. స్పెషల్‌గా కన్సల్టెన్సీ ఓపెన్ చేసి నకిలీ పట్టాలతో దేశాన్ని దాటించేస్తున్నారు. ఇలా అక్రమ దందా సాగిస్తున్న ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ కమిషనరేట్‌కు సంబంధించిన 15 మంది ఈ తతంగం నడిపిస్తుండగా.. అందులో 12 మందిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి నుంచి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్ టాప్‌లు, ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, రెండు ప్రింటర్ రోలర్స్, ఐదు ప్రింటర్ కలర్స్ బాటిల్స్, లామినేషన్ మిషన్, 12 సెల్ ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మంగళవారం కమిషనరేట్ఆఫీస్లో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్రోడ్డు ఏరియాకు చెందిన దార అరుణ్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆకుల రవి అవినాష్ ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్స్కావడంతో వీరికి కంప్యూటర్ఎడ్యుకేషన్ పై నాలెడ్జ్ ఉంది. దీంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్సెంటర్స్టార్ట్చేశారు. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోకపోవడంతో ఇద్దరూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం స్టార్ట్ చేశారు. వీటి ద్వారా ఆదాయం బాగా వస్తుండటంతో దానినే బిజినెస్ గా మార్చుకున్నారు.
కన్సల్టెన్సీలతో ఒప్పందం
హయ్యర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్‌ను ఫారెన్ పంపించేందుకు వరంగల్ సిటీలో కొన్ని కన్సల్టెన్సీలు పని చేస్తున్నాయి. ఫారెన్ వెళ్లాలనుకునే వ్యక్తులు, స్టూడెంట్లను బయటి దేశాలకు పంపించేందుకు ఎలాంటి అర్హత లేకున్నా ఆయా కన్సల్టెన్సీలు క్యాండిడేట్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఆ తరువాత వారిని ఎలాగైనా విదేశాలకు పంపించేందుకు తమకు కావాల్సిన సర్టిఫికెట్లు రెడీ చేసి ఇవ్వాల్సిందిగా దార అరుణ్, ఆకుల రవి అవినాష్‌కి సమాచారం ఇచ్చేవారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేస్తుండటంతో కన్సల్టెన్సీల నుంచి వీరికి ఫుల్గిరాకీ ఉండేది.
11 వర్సిటీల పేరుతో..
మూడేండ్లుగా దందా సాగిస్తున్న ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 11 గుర్తింపు పొందిన యూనివర్సిటీల సర్టిఫికెట్లు సృష్టించడం స్టార్ట్ చేసింది. అందులో తమిళనాడుకు చెందిన వీఎంఆర్‌ఎఫ్ డీమ్డ్యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, కర్నాటకకు చెందిన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌హెల్త్, కర్నాటక స్టేట్ఓపెన్యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బుందేల్ఖండ్యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బిహార్ కు చెందిన మగధ్యూనివర్సిటీ, తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీకి చెందిన నకిలీ మెమోలు సేమ్అదే క్వాలిటీ పేపర్ తో తయారు చేసేవారు. వాటితో ఇప్పటివరకు 62 మందిని గుట్టుచప్పుడు కాకుండా దేశాన్ని దాటించారు. వారంతా యూకే, కెనడా, అమెరికా తదితర దేశాలకు వెళ్లారు. దాంట్లో కొంతమందికి ఎలాంటి విద్యార్హత లేకపోగా.. వారికి వివిధ డిగ్రీలు, ఇంజినీరింగ్ తో పాటు బీఏఎంఎస్ సర్టిఫికెట్లు రెడీ చేసి పంపించారు. ఇంకా 212 మందిని కూడా ఇలాగే పంపించేందుకు సర్టిఫికెట్లు రెడీ చేయగా.. అన్యూహంగా పోలీసులకు చిక్కారు.
కేయూ ప్రొఫెసర్ కంప్లైంట్‌తో..
వివిధ యూనివర్సిటీల పేరున నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న విషయం కాకతీయ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే సుబేదారి, హనుమకొండ పీఎస్‌లో కూడా కేసులు ఫైల్అయ్యాయి. తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ఫోర్స్పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ఇన్చార్జ్అడిషనల్డీసీపీ వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా సోమవారం ఒకే సమయంలో ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించి నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు చేశారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అడిషనల్డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ సీఐలు శ్రీనివాస్ జీ, సంతోష్ , ఎస్సైలు ప్రేమానందం, ప్రియదర్శిని, హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్ , కానిస్టేబుళ్లు మహేందర్, సృజన్, శ్రీనివాస్, శ్రీకాంత్, అలీ, డ్రైవర్ శ్రీనివాస్ ను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి అభినందించారు.
ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.4 లక్షలు
నకిలీ సర్టిఫికెట్ల దందా మస్తుగా సాగుతుండటంతో వారు ఇంకో అడుగు ముందుకేశారు. కొన్ని దేశాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందేందుకు మార్కుల పర్సంటేజీని తప్పనిసరి చేయడం.. ఇంకొన్ని వర్సిటీల్లో ఫస్ట్అటెంప్ట్ లోనే పాస్ అయి ఉండాలనే రూల్స్ఉండటంతో ఆ పాయింట్లను వీరు క్యాష్ చేసుకునేవారు. ఫారెన్ లో చదవాలనే ఆశ ఉండి కనీస మార్కులు లేని స్టూడెంట్లకు ఒరిజినల్మార్కుల మెమో ఆధారంగా.. ఎక్కువ మార్కులతో ఫేక్సర్టిఫికెట్లు తయారు చేసేవారు. ఇలా ఒక్కో సర్టిఫికెట్‌కు లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. సర్టిఫికెట్లపై ఎవరికీ అనుమానం కలగకుండా విదేశాల నుంచి సర్టిఫికెట్ల ప్రింటింగ్ కు అవసరమైన పేపర్లను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు.
నిందితులు వీరే..
దార అరుణ్ (మహబూబాబాద్, ప్రధాన నిందితుడు), ఆకుల రవి అవినాష్ (నర్సంపేట), మామిడి శ్రీకాంత్ రెడ్డి( కన్సల్టెన్సీ, వడ్డేపల్లి), ఆనందుల మహేష్( కన్సల్టెన్సీ, దుగ్గొండి మండలం నాచినపల్లి), మీర్జా అక్తర్ అలీ బేగ్(పోస్టల్ కాలనీ, సుబేదారి), మాదిశెట్టి సచిన్(కన్సల్టెన్సీ నెహ్రూనగర్, మడికొండ), చిదాల సలోనీ అలియాస్ రాధ (ఘట్కేసర్ , హైదరాబాద్), పోగుల సుధాకర్ రెడ్డి(ఎక్సైజ్‌కాలనీ, సుబేదారి), మామిడి స్వాతి(ఎక్సైజ్ కాలనీ, సుబేదారి), బాలాజీ శ్రీనాథ్(గాంధీనగర్, హన్మకొండ), నల్లా ప్రణయ్(గుండ్లసింగారం, హనుమకొండ), అంబటి ఉత్తమ్ కిరణ్ (సుబేదారి, హనుమకొండ). పరారీలో ఉన్న నిందితులు: కాస శ్రీనివాస్(హైదరాబాద్), కుందారపు కృష్ణ(హనుమకొండ), నరిశెట్టి సురేందర్(హనుమకొండ).