ఫేక్ ChatGPT యాప్‌లతో భారీ దోపిడీ.. నెలకు వేల డాలర్లు కొట్టేస్తున్నారు

ఫేక్ ChatGPT యాప్‌లతో భారీ దోపిడీ.. నెలకు వేల డాలర్లు కొట్టేస్తున్నారు

వినియోగదారులకు ఓవర్‌ఛార్జ్ వేసి నెలకు వేల డాలర్లు వచ్చేలా చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌లుగా రూపొందించిన అనేక యాప్‌లను సైబర్ సెక్యూరిటీస్ బహిర్గతం చేసిందని ఓ నివేదిక వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ ప్రకారం, గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్‌లో అనేక ఉచిత యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి తక్కువ ఫంక్షన్స్ ను అందిస్తాయి. అంతేకాదు నిరంతరం ప్రకటనలతో నిండి ఉంటాయి. కాబట్టి, యూజర్స్ కు ఎలాంటి డౌట్ రాకుండా సభ్యత్వంతో తాము వందల డాలర్లు పొందేలా ప్రలోభపెట్టాయి.

నివేదిక ప్రకారం, ఐదు ChatGPT ఫ్లీస్‌వేర్ యాప్‌లను కనుగొన్నారు. ఇవన్నీ ChatGPT అల్గారిథమ్‌పై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు, “Chat GBT” యాప్ డెవలపర్‌లు Google Play లేదా App Storeలో తమ ర్యాంకింగ్‌లను పెంచుకోవడానికి ChatGPT పేరును ఉపయోగించారు. OpenAI ద్వారా ఫంక్షన్స్ ను ఇంట్రడ్యూస్ చేసిన ఈ యాప్‌లు నెలకు 10 డాలర్ల నుంచి సంవత్సరానికి 70 డాలర్ల వరకు ఎక్కడైనా వసూలు చేస్తాయి.

మూడు రోజుల ఉచిత ట్రయల్ తర్వాత, ఆస్క్ AI అసిస్టెంట్ అని పిలువబడే "చాట్ GBT" iOS వెర్షన్, ఒక్క మార్చిలోనే 10వేల డాలర్లు అర్జించింది. ఆ తర్వాత వారానికి 6 డాలర్లు, సంవత్సరానికి 312 డాలర్లు వసూలు చేస్తుందని నివేదిక తెలిపింది.

అంతేకాకుండా వారానికి 7 డాలర్లు లేదా 70 డాలర్ల వార్షిక సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేయమని యూజర్స్ ను ప్రోత్సహించే మరొక ఫ్లీస్‌వేర్ యాప్, Genie.. మునుపటి నెలలో 1 మిలియన్ డాలర్లు సంపాదించిందని నివేదిక పేర్కొంది. “ఈ నివేదికలో చేర్చబడిన కొన్ని ChatGPT ఫ్లీస్‌వేర్ యాప్‌లు ఇప్పటికే తీసివేయబడినప్పటికీ, మరిన్ని పాప్ అప్ అవుతూనే ఉన్నాయి. ఇలా మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఈ తరహా యాప్‌లు ఉన్నాయని వినియోగదారులు తెలుసుకోవాలని, 'సబ్‌స్క్రైబ్' నొక్కినప్పుడల్లా ఫైన్ ప్రింట్ ను తప్పకుండా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు.