ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. రూ. 4 లక్షల నకిలీ నోట్లు సీజ్

నకిలీ 500 రూపాయి నోట్లు ముద్రించి.. వాటిని అమ్ముతున్న ఇందరు నిందితులను సైబరాబాద్ బాలానగర్ SOT  పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇద్దరు వ్యక్తులు నకిలీ 500 రూపాయి నోట్లను ముద్రించి 10 అసలు నోట్లను ఇస్తే.. 40 నకిలీ ఇస్తామని (1:4 Ratio) కొందరు వ్యక్తులను సంప్రదించగా.. ఈ విషయాన్ని  పోలీసులు పసిగట్టారు. అల్లపూర్ పోలీసులతో కలిసి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారివద్ద నుంచి ఎనిమిది వందల(800) Rs. 4,00,000/- విలువగల 500 నకిలీ రూపాయల నోట్లును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 

నకిలీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించిన 2 ప్రింటర్లు, పేపర్స్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.