ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో ఫేక్ కరెన్సీ నోటు కలకలం సృష్టించింది. బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి గ్రోమోర్ షాప్ గుమస్తా రూ.3లక్షల 50వేలు తీసుకువచ్చాడు. అందులో ఓ రూ.500నోటు నకిలీ కరెన్సీగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఫేక్ నోట్స్ చలామణితో ములుగు పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.