మీ ఐడియా అబ్బబ్బా : గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు..

మీ ఐడియా అబ్బబ్బా : గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు..

అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అన్న నానుడి అందరికీ తెలిసిందే. గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి చెప్పాలంటే ఈ నానుడి వాడుతుంటాం. అయితే, గుజరాత్ లో ఒక దొంగల ముఠా చేసిన ఘనకార్యాన్ని చుస్తే.. ఈ నానుడి కచ్చితంగా గుర్తుకొస్తుంది. డబ్బు కోసం దొంగతనాలు చేయటం రిస్క్ అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టేసారు ముగ్గురు దొంగలు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ లోని సార్థనలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

 మొదట గార్మెంట్స్ షాపు పేరిట దొంగనోట్ల తయారీకి పాల్పడుతున్న భవేష్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు సూరత్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు. భవేష్ ను విచారించగా ముఠాలోని మిగతా ముగ్గురి వివరాలు వెల్లడించాడు భవేష్. తాను గత నెలరోజులుగా దొంగనోట్లు ముద్రిస్తున్నానని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అమ్రేలికి చెందిన రాహుల్ చౌహన్, సాగర్, పవన్ బానోడ్ లు తనకు సహకరించినట్లు తెలిపాడు రాథోడ్.

దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి రూ. 1లక్ష విలువచేసే 100రూపాయల దొంగనోట్లు, ఒక కంప్యూటర్, స్కానర్, క్లౌడ్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read :- అమెరికాలో కాల్పులు నలుగురు మృతి