బాన్సువాడలో ఫేక్ డెత్ సర్టిఫికెట్లు కలకలం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ బోర్లం క్యాంప్ లో   ఫేక్ డెత్ సర్టిఫికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి.  వెహికిల్ ఇన్సూరెన్సు డబ్బుల కోసం బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. బోర్లం క్యాంప్ కు చెందిన రాంచందర్ అనే రైతు బతికుండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. 

ఆ సర్టిఫికేట్ చూసి రాంచందర్ షాకయ్యాడు.  దీంతో రుద్రూర్  గ్రామానికి చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ సాగర్ పై పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  మూడేళ్ళ క్రితం రాం చందర్  మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి తన వద్ద ఉన్న ట్రాక్టర్ అమ్మాడు. 

అయితే ఆ ట్రాక్టర్ కొన్నతను ఓ ప్రమాదంలో చనిపోయాడు. బోధన్ పోలీసుల అధీనంలో ఉన్న ట్రాక్టర్ విడిపించేందుకు యజమాని రాంచందర్ మృతి చెందినట్లు   ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మృతుడి  భార్య ఫిర్యాదుతో ఈ  ఫెక్ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది.