డాక్టర్ అవతారమెత్తిన ఆప్టోమెట్రి అసిస్టెంట్​పై కేసు

డాక్టర్ అవతారమెత్తిన ఆప్టోమెట్రి అసిస్టెంట్​పై కేసు

వరంగల్​ సిటీ, వెలుగు:  వరంగల్​ సిటీలో డాక్టర్ అవతారమెత్తిన ఆప్టోమెట్రి అసిస్టెంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన అర్హతలు లేకుండా ప్రజలకు కంటి వైద్య సేవలు అందించే వరంగల్ జేపీఎన్ రోడ్డులోని దక్కన్ ఆప్టికల్స్ ఓనర్ ఎం. జనార్దన్  తను కంటి డాక్టర్ ను అని చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తున్నట్టు  తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు. 

దీంతో కౌన్సిల్ రిజిస్ట్రార్  డి.లాలయ్య కుమార్, చైర్మన్ కె. మహేశ్​కుమార్ కంప్లయింట్ చేయగా మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పీఆర్ఓ నరేశ్ కుమార్ మాట్లాడుతూ ‘ ఆప్టోమెట్రిస్టులు,  సహాయకులు రెఫ్రాక్షన్ సేవలు మాత్రమే చేయాలని తెలిపారు.  వైద్య సలహాలు ఇవ్వడం, కంటి వ్యాధులకు మందులు సూచించడం, సర్జరీల పేరుతో మోసం చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఫేక్ డాక్టర్లుగా గుర్తిస్తే  antiquackerytsmc@onlinetsmc.in మెయిల్ ద్వారా,  91543 82727 నంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని  సూచించారు.