- దమ్మాయిగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణ
- డెకాయ్ ఆపరేషన్‌లో పట్టుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు
కీసర, వెలుగు : డీ ఫార్మసీ చదివి ఎంబీబీఎస్‌గా చలామణి అవడమే కాకుండా ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న వ్యక్తిని మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన బండ సాయివర్ధన్‌రెడ్డి డీ ఫార్మసీ పూర్తి చేశాడు. కానీ ఎంబీబీఎస్ చేశానంటూ చలామణి కావడమే కాకుండా దమ్మాయిగూడలో లలిత మల్టీ స్పెషాలిటీ పేరుతో ఏకంగా ఓ హాస్పిటల్‌నే నడుపుతున్నాడు.
సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు డెకాయ్ ఆపరేషన్‌లో భాగంగా గురువారం పేషెంట్లుగా లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ చేస్తున్న సాయివర్ధన్‌రెడ్డిని నకిలీ డాక్టర్‌గా గుర్తించి అతడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కారు, రూ.8,500, స్టెతస్కోప్, ప్రిస్క్రిప్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌వోటీ పోలీసుల ఫిర్యాదుతో బండ సాయివర్ధన్‌రెడ్డిపై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు.